కరోనా బాధితుల కోసం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన అకాలీదళ్ ఎమ్మెల్యేలు

ABN , First Publish Date - 2020-03-23T23:03:07+05:30 IST

శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కోవిడ్ బాధితుల సహాయార్థం నెల జీతాలను ముఖ్యమంత్రి సహాయ

కరోనా బాధితుల కోసం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన అకాలీదళ్ ఎమ్మెల్యేలు

పంజాబ్ : శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. కోవిడ్ బాధితుల సహాయార్థం నెల జీతాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కోవిడ్ బాధితులకు మరింత మెరుగైన సహాయం అందించడానికి వీలుగా ఈ సహాయం ఉపకరిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అధ్యక్షత సోమవారం కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.


‘‘అధ్యక్షుడు సూచించిన ప్రకారం... నెల జీతాన్ని కోవిడ్ బాధితులకు విరాళంగా ఇవ్వాలని మా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నాం.’’ అని పార్టీ నేతలు ప్రకటించారు. ఇలాగే ఇత పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చేసి, తమ ఉదార స్వభావాన్ని చాటుకోవాలని సుఖ్‌బీర్ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితి మానవత్వానికే పెద్ద సవాల్ అని, మనల్ని మనం కాపాడుకుంటూనే బాధితులకు సహాయం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మనకు వీలైన రీతిలో బాధితులకు సహాయం చేయాలని సుఖ్‌బీర్ సింగ్ కోరారు. 

Updated Date - 2020-03-23T23:03:07+05:30 IST