కోవిడ్-19: మోదీ పిలుపుతో సార్క్ దేశాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్

ABN , First Publish Date - 2020-03-23T02:04:12+05:30 IST

సార్క్ దేశాల్లో కోవిడ్-19 పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు సార్క్ విపత్తు నిర్వాహక కేంద్రం..

కోవిడ్-19: మోదీ పిలుపుతో సార్క్ దేశాల కోసం ప్రత్యేక వెబ్‌సైట్

న్యూఢిల్లీ: సార్క్ దేశాల్లో కోవిడ్-19 పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు సార్క్ విపత్తు నిర్వాహక కేంద్రం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. సార్క్ దేశాధినేతలతో ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా చేసిన ప్రకటన మేరకు ఈ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ ఇవాళ ట్విటర్లో వెల్లడించారు. దీంతో ఇకపై www.covid19-sdmc.org వెబ్‌సైట్లో పూర్తి సమాచారం అందుబాటులోకి రానుంది. భారత్, మాల్దీవులు, శ్రీలంక, భూటాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ సహా సార్క్ దేశాల్లో నోవల్ కరోనా వైరస్‌పై ఎప్పటికప్పుడు ఈ వెబ్‌సైట్లో అప్‌డేట్స్ ఇవ్వనున్నారు.


కాగా భారత్ స్వచ్ఛందంగా ప్రారంభించిన ‘సార్క్ కోవిడ్-19 ఎమర్జెన్సీ ఫండ్’ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్ దేశాలు సైతం ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అత్యవసర నిధి కోసం భారత్ తరపున ప్రధాని మోదీ 10 మిలియన్ డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. 

Updated Date - 2020-03-23T02:04:12+05:30 IST