చైనాతో ఉద్రిక్తతల వేళ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకున్న భారత్
ABN , First Publish Date - 2020-06-18T23:42:37+05:30 IST
న్యూఢిల్లీ: ఈ నెల 23న జరిగే రష్యా-భారత్-చైనా సమావేశానికి భారత్ హాజరుకానుంది. భారత విదేశాంగ శాఖ దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చింది. రష్యా చైర్మన్‌గా
న్యూఢిల్లీ: ఈ నెల 23న జరిగే రష్యా-భారత్-చైనా సమావేశానికి భారత్ హాజరుకానుంది. భారత విదేశాంగ శాఖ దీనికి సంబంధించి స్పష్టత ఇచ్చింది. రష్యా చైర్మన్‌గా వ్యవహరించే రిక్ సమావేశం ఈ సారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనుంది.
లడక్ గల్వాన్ లోయ ఘర్షణ నేపథ్యంలో సమావేశం జరగకపోవచ్చని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్ చైనా విదేశాంగ మంత్రులు మాట్లాడుకోవడంతో రిక్ సమావేశం జరగడం ఖాయమని రష్యా అంచనా వేసింది. భారత్‌లో రష్యా రాయబారి నికోలె కుడషెవ్ నిన్న మీడియాతో మాట్లాడుతూ సమావేశం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. సరిగ్గా ఆయన చెప్పినట్లుగానే సమావేశానికి హాజరు కావాలని భారత్ నిర్ణయించింది. మూడు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొనే ఈ సమావేశంలో గల్వాన్ లోయలో చైనా బలగాల పాశవిక దాడిపై భారత్ డ్రాగన్ కంట్రీని నిలదీసే అవకాశం ఉంది. చైనా బలగాల దాడిలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. దీనిపై భారత్‌లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. దీంతో రిక్ సమావేశంలో భారత్ చైనాను గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంది. సమావేశం వాడీవేడిగా జరగవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
రిక్ సమావేశంలో ప్రపంచ రాజకీయ స్థితిగతులతో పాటు ఆర్ధిక వ్యవహారాలపై చర్చిస్తారు. కోవిడ్ ప్రభావంపై కూడా మూడు దేశాలూ చర్చలు జరుపుతాయి.