ఒక్క రోజులో వెయ్యిపైగా కరోనా పాజిటివ్ కేసులు..

ABN , First Publish Date - 2020-04-08T02:32:18+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇప్పటి వరకు యూరప్, అమెరికాలపై తన విశ్వరూపం చూపిన ఈ వైరస్.. ఇప్పుడు రష్యాపై కన్నేసినట్లుంది.

ఒక్క రోజులో వెయ్యిపైగా కరోనా పాజిటివ్ కేసులు..

మాస్కో: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఇప్పటి వరకు యూరప్, అమెరికాలపై తన విశ్వరూపం చూపిన ఈ వైరస్.. ఇప్పుడు రష్యాపై కన్నేసినట్లుంది. మూడురోజుల నుంచి రష్యాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం నాడు రికార్డు స్థాయిలో 1,154 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా 24గంటల్లో వెయ్యిపైగా కేసులు నమోదవడం రష్యా లో ఇదే తొలిసారి. దీంతో ఇక్కడి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,497కు చేరింది. ఈ విషయాన్ని క్రైసిస్ రెస్పాన్స్ కేంద్రం వెల్లడించింది. అలాగే కరోనా కారణంగా రష్యాలో మరణించిన వారి సంఖ్య కూడా 58కి చేరింది. ఇక్కడ 24 గంటల వ్యవధిలో 11 కొత్త మరణాలు నమోదయ్యాయి. మొత్తమ్మీద 494 మంది కరోనా సోకినా కోలుకున్నారు. ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, ప్రపంచవ్యాప్తంగా 13.78.421 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో 78,110 మంది కన్నుమూశారు. కేవలం మంగళవారం నాడే ప్రపంచవ్యాప్తంగా 3.456 మరణాలు నమోదయ్యాయి.

Read more