చైనాతో ఉద్రిక్తత..భారత్‌కు మద్దతిస్తామన్న రష్యా..

ABN , First Publish Date - 2020-06-19T02:08:22+05:30 IST

చైనాతో వివాదాలు పరిష్కరించుకునే క్రమంలో భారత్‌కు మద్దతిస్తామని రష్యా తెలిపినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

చైనాతో ఉద్రిక్తత..భారత్‌కు మద్దతిస్తామన్న రష్యా..

న్యూఢిల్లీ: చైనాతో వివాదాలు పరిష్కరించుకునే క్రమంలో భారత్‌కు మద్దతిస్తామని రష్యా తెలిపినట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తూర్పు లద్దాఖ్‌ ఘర్షణలో భారత్ చైనా సైనికుల మరణించడంపై రష్యా చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బబూష్కిన్ తాజాగా స్పందించారు. ‘ఉద్రిక్తతలు త్వరలో సమసిపోవాలని మేము కోరుకుంటున్నాము. సయోధ్య వల్ల కలిగే లాభాలను దృష్టిలో పెట్టుకుని ఇరు దేశాలూ నిర్మాణాత్మక చర్చల్లో పాల్గొంటాయని భావిస్తున్నాం. ఇది ఈ ప్రాంతం భవితవ్యానికి మంచిదని రష్యా భావిస్తోంది ’ అని ఆయన వ్యాఖ్యానించారు. అంతుకుమునుపు రష్యా విదేశాంగ శాఖ మంత్రి కూడా దీనిపై స్పందించారు.  ‘ఇరు దేశాల మిలిటరీ అధికారులు చర్చలు ప్రారంభించారు. ఉద్రిక్తతలు ఎలా చల్లార్చాలనే దానిపై చర్చిస్తున్నారు. దీన్ని మేము స్వాగతిస్తున్నాం’ అని అన్నారు. రష్యా భారత్‌ల మధ్య బలమైన దౌత్యసంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. కొవిడ్-19తో పాటు అనేక సమస్యలపై దేశాధినేతల స్థాయిలో ఇరు దేశాల మధ్య అనేక మార్లు సంప్రదింపులు జరిగాయి. తాజాగా లద్దాఖ్ ఘర్షణలు చల్లారేందుకు భారత్‌కు తన వంతు సహకారం అందిస్తానని రష్యా స్పష్టం చేసింది. 

Updated Date - 2020-06-19T02:08:22+05:30 IST