రష్యా అంతరీక్ష ప్రయోగ పాటవాన్ని అమెరికా గౌరవిస్తే మంచిది: రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్

ABN , First Publish Date - 2020-06-11T05:54:19+05:30 IST

గత తొమ్మిది సంవత్సరాలు వ్యోమగాముల్ని అంతరీక్షంలోకి పంపించేందుకు రష్యాపై ఆధారపడ్డ అమెరికా రష్యా పాటవాన్ని గూర్తించి, గౌరవించాలని రష్యా అంతరీక్ష పరిశోధన సంస్థ చీఫ్ వ్యాఖ్యానించారు.

రష్యా అంతరీక్ష ప్రయోగ పాటవాన్ని అమెరికా గౌరవిస్తే మంచిది: రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్

మాస్కో: గత తొమ్మిది సంవత్సరాలు వ్యోమగాముల్ని అంతరీక్షంలోకి పంపించేందుకు రష్యాపై ఆధారపడ్డ అమెరికా రష్యా పాటవాన్ని గూర్తించి, గౌరవించాలని రష్యా అంతరీక్ష పరిశోధన సంస్థ చీఫ్ వ్యాఖ్యానించారు. ప్రేవేటు సంస్థ అయిన స్పేస్ ఎక్స్ తొలిసారిగా అమెరికా వ్యోమగాములను అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాకు రష్యా అవసరం తీరిపోయింది. ఇకపై సదరు ప్రేవేటు సంస్థ ద్వారానే అంతరీక్ష యానాలు చేపట్టే సౌలభ్యం కుదిరింది. ఈ నేపథ్యంలో రష్యా అంతరీక్ష ప్రయోగాల సామర్థ్యంపై అమెరికాలో పలు జోకులు పేలాయి. ఈ ధోరణిని నిరసించిన రష్యా అంతరీక్ష పరిశోధన సంస్థ చీఫ్ తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. రోదసి యానం చేపట్టిన తొలి దేశం రష్యా అన్న విషయాన్ని అమెరికా గుర్తెరిగి మసులుకోవాలని తేల్చి చెప్పారు. 

Updated Date - 2020-06-11T05:54:19+05:30 IST