జీరో కాంటాక్ట్ విధానంలో గోల్డ్ లోన్.. అమలు చేయనున్న ‘రుపీక్’

ABN , First Publish Date - 2020-06-26T03:46:09+05:30 IST

భారత్‌లో రోజురోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనాను నిలువరించే...

జీరో కాంటాక్ట్ విధానంలో గోల్డ్ లోన్.. అమలు చేయనున్న ‘రుపీక్’

న్యూఢిల్లీ: భారత్‌లో రోజురోజుకి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. కరోనాను నిలువరించే ప్రయత్నంగా భారత ప్రజలు సోషల్ డిస్టెన్సింగ్‌ను పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారంపై రుణాలను ఇచ్చే సంస్థలు వినియోగదారులకు రుణాలు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాయి. అయితే బంగారంపై ఆన్‌లైన్‌ రుణ సదుపాయాన్ని కల్పించే రుపీక్ ఫిన్‌టెక్ మాత్రం ఓ అడుగు ముందుకు వేసింది. తన కస్టమర్ల రక్షణ కొరకు ఓ సరికొత్త యంత్రాన్ని రూపొందించింది. ఈ యంత్రం ద్వారా కస్టమర్ల‌ వద్ద జీరో కాంటాక్ట్ విధానాన్ని అవలంబిస్తారు. వారి వద్ద నుంచి తీసుకునే ఆభరణాలను ఓ పెట్టెలో పెట్టి యంత్రంలో పెడతారు. దీంతో యంత్రంలోని యూవీ కిరణాలు ఆభరణాలపై ఉండే క్రిములను 99.9 శాతం నాశనం చేస్తాయి. దీనిని దేశమంతట ఉన్న తన సంస్థల్లో వినియోగిస్తున్నట్లు రుపీక్ తెలిపింది. 

 ‘ఈ కరోనా సమయంలో ప్రజలకు డబ్బు ఆవశ్యకత ఎంతగానో ఉంటుంది. అయితే కరోనా కారణంగా మా కస్టమర్లు అభద్రతతో ఉండకూడదని అనుకున్నాం. దానికి పరిష్కారంగానే కొన్ని నెలలు పాటు కష్టపాడి ఈ రుపీక్ కియోస్కి ని కనిపెట్టడం జరగింది. ఇది చాలా తక్కువ చోటును ఆక్రమిస్తుంది. ఇందుకుగాను దీనిని దేశమంతట వినియోగంలోకి తీసుకురావడం సులభతరం అవుతుంద’ని రుపీక్ పేర్కొంది. ఈ టెక్నాలజీ పూర్తిగా భారతీయ పరిజ్ఞానంతో తయారు చేయబడిందని, తమ కార్యకలాపాలు కొనసాగుతున్న 11 నగరాల్లో దీనిని వినియోగంలోకి తీసుకురానున్నట్లు రుపీక్ వెల్లడించింది.

Updated Date - 2020-06-26T03:46:09+05:30 IST