డిసెంబరు 1 నుంచి మళ్లీ లాక్‌డౌన్..?
ABN , First Publish Date - 2020-11-13T09:22:51+05:30 IST
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది...
- ఏది నిజం.. ఏది అబద్ధం
ప్రచారం: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి డిసెంబరు 1 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది. ట్విటర్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఈ తరహా వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
నిజం: సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను ఖండిస్తూ భారత సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రభుత్వానికి చెందిన నిజ నిర్ధారణ విభాగం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) దీనిపై స్పందించింది. ప్రముఖ మీడియా సంస్థ పేరుతో మార్ఫింగ్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని, అయితే లాక్‌డౌన్ పెట్టే ఆలోచన ఇప్పటి వరకు ప్రభుత్వానికి లేదని పీఐబీ వెల్లడించింది.