అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్న 9 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ!
ABN , First Publish Date - 2020-12-19T19:25:13+05:30 IST
కేంద్ర హోంమంత్రి బెంగాల్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. ఈ రెండు రోజుల పర్యటన ద్వారా అన్ని పార్టీలకు, ముఖ్యంగా అధికార

కోల్‌కతా : కేంద్ర హోంమంత్రి బెంగాల్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. ఈ రెండు రోజుల పర్యటన ద్వారా అన్ని పార్టీలకు, ముఖ్యంగా అధికార తృణమూల్‌కు రాజకీయంగా నష్టం చేసి హస్తినకు తిరిగి వెళ్లాలని అమిత్‌షా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మాజీ మంత్రి, తృణమూల్ కీలక నేత సుబేందు అధికారి మాత్రమే బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే హఠాత్తుగా అధికారితో పాటు వివిధ పార్టీలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కూడా అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరుతారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఈ జాబితాలో టీఎంసీతో పాటు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం ఎమ్మెల్యేలు కూడా ఉండటం విశేషం. వారి పేర్లు వరుసగా
1. సునీల్ మోండల్ - తృణమూల్ (ఎంపీ)
2. బనాశ్రీ మైతీ - తృణమూల్ (ఎమ్మెల్యే)
3. విశ్వజిత్ కుందు - తృణమూల్ (ఎమ్మెల్యే)
4. సైకత్ పంజా - తృణమూల్ (ఎమ్మెల్యే)
5. శీలభద్ర దత్తా - తృణమూల్ (ఎమ్మెల్యే)
6. సుక్రా ముండా - తృణమూల్ (ఎమ్మెల్యే)
7. సధీప్ ముఖర్జీ - కాంగ్రెస్ (ఎమ్మెల్యే)
8. తపసీ మోండల్ - సీపీఎం (ఎమ్మెల్యే)
9. అశోక్ దిండా - సీపీఐ (ఎమ్మెల్యే)
10. దిపాలీ విశ్వాస్ - సీపీఎం నుంచి గెలిచి, తర్వాత తృణమూల్‌లో చేరారు.)
ఈ 9 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారని బెంగాల్ రాజకీయాల్లో తీవ్రమైన పుకార్లు చెలరేగుతున్నాయి.