రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త మాధవ్ గోవింద వైద్య కన్నుమూత

ABN , First Publish Date - 2020-12-19T22:57:45+05:30 IST

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త, సిద్ధాంత కర్త మాధవ్ గోవింద వైద్య శనివారం కన్నుమూశారు. నాగపూర్‌లోని స్పందన్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధాంతకర్త మాధవ్ గోవింద వైద్య కన్నుమూత

నాగపూర్ : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త, సిద్ధాంత కర్త మాధవ్ గోవింద వైద్య శనివారం కన్నుమూశారు. నాగపూర్‌లోని స్పందన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3:30 గం.లకు తుదిశ్వాస విడిచారని ఆయన మనుమడు విష్ణువైద్య వెల్లడించారు. శుక్రవారం ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మొట్ట మొదటి అధికార ప్రతినిధిగా ఈయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన మృతిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. ‘‘సంఘ్ జ్యేష్ఠ కార్యకర్త, సిద్ధాంతకర్త మాధవ్ గోవింద్ వైద్య వెళ్లిపోయారు. నా వినయ పూర్వక నివాళి అర్పిస్తున్నా. ద్వితీయ సరసంఘ చాలక్ గురూజీతో పాటు మిగిలిన సర సంఘచాలకులతోనూ కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆరెస్సెస్ కు ఆయన చేసిన సేవ నిరుపమానం. తుది శ్వాస వరకూ సిద్ధాంతం కోసం పోరాడుతూనే ఉన్నారు. చాలా మంది పాత్రికేయులకు ఆదర్శప్రాయులు. నా చిన్నతనం నుంచి వారు నాకు తెలుసు. ఓం శాంతి....’’ అని నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-12-19T22:57:45+05:30 IST