రూ.58వేల కోట్లు దానం!

ABN , First Publish Date - 2020-09-17T07:56:27+05:30 IST

ఛార్ల్స్‌ ‘చక్‌’ ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ షాపర్స్‌’ సహవ్యవస్థాపకుడు. పదవీ విరమణ తర్వాత తన భార్యతో కలిసి జీవించేందుకు రూ.14కోట్లనే ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు...

రూ.58వేల కోట్లు దానం!

  • వ్యాపారవేత్త ఛార్ల్స్‌ ఫీనీ ఔదార్యం


శాన్‌ ఫ్రాన్సిస్కో, సెప్టెంబరు 16: ఛార్ల్స్‌ ‘చక్‌’ ఫీనీ. విమానాశ్రయాల్లో ఉండే ‘డ్యూటీ ఫ్రీ షాపర్స్‌’ సహవ్యవస్థాపకుడు. రూ.58వేల కోట్లకు అధినేత. అంత సంపాదించినా, ఆయన ఆనందం డబ్బులో కాక, దాతృత్వంలో వెతుక్కున్నారు. తన స్వచ్ఛంద సంస్థ ‘అట్లాంటిక్‌ ఫిలాంత్రోపీస్‌’ ద్వారా యావదాస్తిని దానం చేసేస్తానని 2012లో ప్రకటించిన ఫీనీ, ఆ మాటను నిలుపుకున్నారు. పదవీ విరమణ తర్వాత తన భార్యతో కలిసి జీవించేందుకు రూ.14కోట్లనే ఉంచుకుని, మిగిలిన మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలకు దానమిచ్చేశారు. ప్రస్తుత నెలతో ఆయన దానాలు పూర్తైపోవడం తో.. ఈ నెల 14న ఫీనీ స్వచ్ఛంద సంస్థ ప్రయాణం ముగిసింది. ‘చాలా నేర్చుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నేను బతికుండగానే ఈ మంచి పని పూర్తి కావడం నాకు బాగా అనిపిస్తోంది’ అని ఆయన ఫోర్బ్స్‌ పత్రికతో వ్యాఖ్యానించారు. బిల్‌ గేట్స్‌, వారెన్‌ బఫెట్‌ ఇద్దరూ తమ దాతృత్వాన్ని చాటుకోవడం వెనుక స్ఫూర్తి ఫీనీయే కావడం ఆసక్తికరం. ‘‘మేము సంపా దించిన అపార సంపదను దానం చేసేందుకు చక్‌ మాకు ఓ దారిని ఏర్పరిచాడు. మన ఆస్తిలో సగం కాదు, యావదాస్తిని దానం చేయాలంటూ తను నాతో పాటు ఎంతోమందిలో స్ఫూర్తిని నింపాడు’’ అని బిల్‌ గేట్స్‌ పేర్కొన్నారు. ఒకప్పుడు 58వేల కోట్ల ఆస్తిని కలిగిన ఆ మాజీ కుబేరుడి ప్రస్తుత నివాసం.. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఒక మామూలు అపార్ట్‌మెంట్‌. తన భార్యతో కలిసి విశ్రాం త జీవితాన్ని ఓ మధ్యతరగతి మనిషిలా ఆయన గడుపుతుండటం విశేషం.

Updated Date - 2020-09-17T07:56:27+05:30 IST