తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్సకు రోజుకు..

ABN , First Publish Date - 2020-06-04T20:30:02+05:30 IST

తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్సకు రోజుకు రూ.23 వేలు వసూలు చేయాలని...

తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్సకు రోజుకు..

చెన్నై: తమిళనాడులోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్-19 చికిత్సకు రోజుకు రూ.23 వేలు వసూలు చేయాలని ఆసుపత్రుల యాజమాన్యాలకు తమిళనాడు ఐఎంఏ(ఇండియన్ మెడికల్ అసోసియేషన్) ప్రతిపాదించింది. కొవిడ్-19 తొలి దశలో ఉన్న రోగులకు 10 రోజులు చికిత్స చేస్తే రూ.2.31 లక్షలు వసూలు చేయాలని సూచించింది. అదే.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతున్న రోగులకు 17 రోజుల చికిత్సకు గానూ రూ.4.31 లక్షలు ఛార్జ్ చేయాలని ప్రతిపాదించింది. అంటే.. కరోనా లక్షణాలతో తీవ్రంగా బాధపడుతున్న రోగులు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాలంటే రోజుకు రూ.25,353 చెల్లించాల్సిందే.


ప్రైవేటు ఆసుపత్రులు కొవిడ్-19 చికిత్సకు ఎక్కువ మొత్తంలో ఛార్జ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని కొద్ది రోజుల క్రితం తమిళనాడు ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో.. కొవిడ్-19 చికిత్సకు ఒక నిర్ధిష్ట ఛార్జీలను ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం నేపథ్యంలోనే తాజాగా ఐఎంఏ ఈ ప్రతిపాదనలను ప్రకటించింది.

Updated Date - 2020-06-04T20:30:02+05:30 IST