పీఎ్‌ఫఐ బ్యాంకు ఖాతాల్లో రూ.100 కోట్లు

ABN , First Publish Date - 2020-12-25T07:53:40+05:30 IST

కేరళకు చెందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) గత కొన్నేళ్లలో తన బ్యాంకు ఖాతాల్లో రూ.100 కోట్లకు పైనే నిధులను స్వీకరించిందని కేరళ ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది.

పీఎ్‌ఫఐ బ్యాంకు ఖాతాల్లో రూ.100 కోట్లు

కోచి, డిసెంబరు 24: కేరళకు చెందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎ్‌ఫఐ) గత కొన్నేళ్లలో తన బ్యాంకు ఖాతాల్లో రూ.100 కోట్లకు పైనే నిధులను స్వీకరించిందని కేరళ ప్రత్యేక కోర్టుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. పీఎ్‌ఫఐకు వ్యతిరేకంగా హవాలా కేసును దర్యాప్తు చేస్తున్న ఈడీ.. కోర్టుకు గురువారం అఫిడవిట్‌ను సమర్పించింది. ఈ కేసులో అరెస్టయిన ఆ సంస్థ విద్యార్థి విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి కేఏ రౌఫ్‌ షరీఫ్‌ కస్టడీని మరి కొంతకాలం పొడిగించాలని విజ్ఞప్తి చేసింది. ఈడీ విజ్ఞప్తిని మన్నిస్తూ షరీఫ్‌ కస్టడీని కోర్టు 3 నెలలకు పొడిగించింది. 

Updated Date - 2020-12-25T07:53:40+05:30 IST