థానేలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2020-10-04T15:16:34+05:30 IST

మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది.

థానేలో ఘోర రోడ్డు ప్రమాదం

థానే: మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం జరిగింది. భారీ లోడుతో వెళుతున్న ఓ ట్రక్కు వాఘాబిల్ ఫ్లై ఓవర్ నుంచి మలుపు తిరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కులోనుంచి మెటీరియల్ జారీ కిందపడింది. ఆ సమయంలో బ్రిడ్జి కింద వెళుతున్నకారుపై పడడంతో ఆ కారు నుజ్జు నజ్జు అయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దీంతో ఫ్లై ఓవర్ పైనా, కింద కొన్ని గంటలపాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-10-04T15:16:34+05:30 IST