మొబైల్ ఫోన్ల వల్లే ఈ దారుణాలు: ఆర్జేడీ నేత

ABN , First Publish Date - 2020-12-10T22:27:50+05:30 IST

జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా అనే గిరిజన ప్రాంతంలో ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. మార్కెట్‌కు వెళ్లి వస్తున్న భార్యాభర్తల్ని అడ్డుకున్నారు. అనంతరం భర్తను నిర్బంధించి భార్యపై అత్యాచారం చేశారు. ‘‘ఇలాంటి వాటి గురించి ఎవరూ ఊహించలేరు

మొబైల్ ఫోన్ల వల్లే ఈ దారుణాలు: ఆర్జేడీ నేత

రాంచీ: అత్యాచారలు పెరగడానికి కారణం మొబైల్ ఫోన్లేనని రాష్ట్రీయ జనతా దళ్ నేత శివానంద్ తివారీ అన్నారు. మొబైల్ ఫోన్లలో నీలి చిత్రాలు అందుబాటులో ఉండడం వల్ల.. వాటిని చూస్తూ యువత ఆలోచనా విధానం మారిపోతుందని, అందుకే ఇలాంటి దారుణాలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యాచార ఘటనల గురించి వినడం చాలా అరుదని, ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో ఇలాంటి నేరాలు జరగడానికి మొబైల్ ఫోన్లే కారణమని ఆయన అన్నారు.


జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కా అనే గిరిజన ప్రాంతంలో ఓ వివాహితపై అత్యాచారం జరిగింది. మార్కెట్‌కు వెళ్లి వస్తున్న భార్యాభర్తల్ని అడ్డుకున్నారు. అనంతరం భర్తను నిర్బంధించి భార్యపై అత్యాచారం చేశారు. ‘‘ఇలాంటి వాటి గురించి ఎవరూ ఊహించలేరు. గిరిజన ప్రాంతాల్లో అత్యాచారాలు జరగడమేంటి? మొబైల్ ఫోన్లలో ఐటమ్ డాన్స్, ప్రకటనలు, పోర్నోగ్రఫిక్ కంటెంట్ ఎక్కువై పోయి యువత ఆలోచనా విధానం మారిపోతోంది. అయితే వీటిని అడ్డుకోవడానికి బలమైన చట్టాలు మాత్రమే ఉంటే సరిపోదు. నిర్భయ ఘటన సమయంలోనూ నేను ఇదే చెప్పాను’’ అని తివారీ అన్నారు.

Updated Date - 2020-12-10T22:27:50+05:30 IST