కరోనా ఎఫెక్ట్: లాలూ జైలుకు కాస్త విరామం

ABN , First Publish Date - 2020-04-07T17:18:51+05:30 IST

జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కాస్త ఉపశమనం లభించనుంది. లాలూ జైలు నుండి బయటకు వచ్చే అవకాశాలున్నాయి. లాలూకు పెరోల్ మంజూరు ...

కరోనా ఎఫెక్ట్: లాలూ జైలుకు కాస్త విరామం

పట్నా:  జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు కాస్త ఉపశమనం లభించనుంది. లాలూ జైలు నుండి బయటకు వచ్చే అవకాశాలున్నాయి. లాలూకు పెరోల్ మంజూరు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పెరోల్ మంజూరు చేయనున్నారని తెలుస్తోంది.  కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖైదీల పెరోల్ మంజూరుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్  రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. కాగా  1990- 1994 సంవత్సరాల మధ్య కాలంలో పశుగ్రాసం కొనుగోలు పేరిట అవినీతికి పాల్పడిన అప్పటి సీఎం లాలూ కేసు తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం జైలు శిక్షఅనుభవిస్తున్నారు. 

Read more