భారత్ పైచేయి సాధించింది.. రియాజ్ మరణంతో షాక్ తిన్నాం
ABN , First Publish Date - 2020-05-10T01:35:31+05:30 IST
కశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న రియాజ్ నాయకూ మరణం..ఆ సంస్థకు భారీ నష్టం మిగిల్చినట్టు తెలుస్తోంది.
ఇస్లామాబాద్: కశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహిస్తున్న రియాజ్ నాయకూ మరణం..ఆ సంస్థకు భారీ నష్టం మిగిల్చినట్టు తెలుస్తోంది. హిజ్బుల్ సంస్థ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పాకిస్థాన్‌లో సదరు సంస్థ ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో సలాహుద్దీన్ చేసిని ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చెక్కర్లో కొడుతోంది. ఆ సమావేశంలో సలాహుద్దీన్..రియాజ్ మరణం తమకు భారీ షాకించ్చిందని వ్యాఖ్యానించాడట.
‘రియాజ్ మరణం మనందరికీ పెద్ద షాక్. అయితే కశ్మీర్‌లో ఇటువంటి త్యాగాలు అనేకం జరిగాయి. జనవరి నుంచి ఇప్పటి వరకూ 80 మంది ముజాహిద్దీన్‌లు ప్రాణత్యాగం చేశారు. వారందరూ ఉన్నత విద్యావంతులే కాకుండా సుశిక్షితులు కూడా. అయితే వీరు కూడా హంద్వారాలో శత్రువుల(భద్రతా దళాల) వెన్ను విరిచినప్పటికీ వారే(భారత్) పైచేయి సాధించారు’ అని సలాహుద్దీన్ అన్నాడట. ఈ పరిస్థితికి తమ విధానాల వైఫల్యమే కారణమని కూడా వ్యాఖ్యానించాడు. కాగా.. ఒక ఉగ్రవాద సంస్థకు నాయకత్వం వహించే వ్యక్తి బహిరంగంగా ఇలాంటి సమవేశాలు ఏర్పాటు చేయడం మనేది ప్రభుత్వం సాయం లేకుండా జరగదని, టెర్రరిస్టులకు పాక్ ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందనడానికి ఇది నిదర్శనమని భారత్ నిఘా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.