టెక్‌ఫిన్‌ సంస్థలతో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం

ABN , First Publish Date - 2020-12-10T07:31:38+05:30 IST

ఆర్థిక సేవలు అందిస్తున్న టెక్‌ సంస్థలను (టెక్‌ఫిన్‌ సంస్థలు) నియంత్రించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (

టెక్‌ఫిన్‌ సంస్థలతో ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం

నియంత్రించండి, ఢిల్లీ హైకోర్టులో పిల్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 9: ఆర్థిక సేవలు అందిస్తున్న టెక్‌ సంస్థలను (టెక్‌ఫిన్‌ సంస్థలు) నియంత్రించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం (పిల్‌) దాఖలైంది. ఆర్థికవేత్త రేష్మి పి భాస్కరన్‌ ఈ పిల్‌ను దాఖలు చేశారు. టెక్నాలజీ సేవలతో పాటు ఆర్థిక సేవలు కూడా అందిస్తున్న ఫేస్‌బుక్‌, గూ గుల్‌, అమెజాన్‌ తదితర టెక్‌ఫిన్‌ సంస్థలపై నియంత్రణకు పూర్తిస్థాయి నిబంధనల్ని రూపొందించేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు.


కాగా.. ఆ పిల్‌పై స్పందించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ), సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్చేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబీ), పెన్షన్‌ ఫండ్‌ రెగులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(పీఎ్‌ఫఆర్‌డేఏ), ఇన్సూరెన్స్‌ రెగులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐఆర్‌డీఏఐ), నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ)లకు కోర్టు నోటీసులు జారీ చేసింది. 


Updated Date - 2020-12-10T07:31:38+05:30 IST