సాయంకాలం వేళ మద్యం దుకాణాలు తెరవాలి : రుషి కపూర్

ABN , First Publish Date - 2020-03-28T23:30:45+05:30 IST

దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలవుతున్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రుషి కపూర్ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు

సాయంకాలం వేళ మద్యం దుకాణాలు తెరవాలి : రుషి కపూర్

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా అష్ట దిగ్బంధనం అమలవుతున్న సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రుషి కపూర్ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. జనం డిప్రెషన్‌తో ఇళ్ళల్లో ఉంటారని, వారికి కాస్త ఉపశమనం కలగాలని అన్నారు. జనానికి విముక్తి లభించడం కోసం సాయంత్రం వేళల్లో కాసేపు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వాలను కోరారు. శనివారం ఆయన ఇచ్చిన ట్వీట్లలో ఈ సలహా ఇచ్చారు.


‘‘ఆలోచించండి. ప్రభుత్వం అన్ని లైసెన్స్‌డ్ లిక్కర్ స్టోర్స్‌ను సాయంకాలం సమయంలో కాసేపు తెరవాలి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. జనం తమ చుట్టూ ఉన్న ఈ డిప్రెషన్, అనిశ్చితితో ఇంట్లో ఉంటారు. పోలీసులు, వైద్యులు, ప్రజలు ఇలా అందరికీ కాస్త విముక్తి అవసరం. బ్లాక్‌లో అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి’’ అని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


‘‘రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్సయిజ్ నుంచి ఆదాయం చాలా అవసరం. డిప్రెషన్‌కి ఫ్రస్ట్రేషన్ తోడవకూడదు. తాగుతున్నారు, చట్టబద్ధం చేయండి, ఇందులో కపటం లేదు. ఇవి నా భావాలు’’ అని మరొక ట్వీట్‌లో రుషి కపూర్ పేర్కొన్నారు.


Updated Date - 2020-03-28T23:30:45+05:30 IST