బీహార్‌లో అత్యంత ధనవంతురాలైన ఎమ్మెల్యే... ‘బాహుబలి’ భర్త చొరవతో...

ABN , First Publish Date - 2020-10-03T12:12:39+05:30 IST

బీహార్‌లో ఎన్నికల వేడి ఊపందుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 240. వారిలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 28. వీరిలో ఖగడియా ఎమ్మెల్యే(జేడీయూ) పూనమ్ యాదవ్ అత్యంత ధనవంతురాలిగా...

బీహార్‌లో అత్యంత ధనవంతురాలైన ఎమ్మెల్యే... ‘బాహుబలి’ భర్త చొరవతో...

పట్నా: బీహార్‌లో ఎన్నికల వేడి ఊపందుకుంది. రాష్ట్రంలో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 240. వారిలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 28. వీరిలో ఖగడియా ఎమ్మెల్యే(జేడీయూ) పూనమ్ యాదవ్ అత్యంత ధనవంతురాలిగా పేరొందారు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె చర్చల్లోకి వస్తుంటారు. ఆమె కవల సోదరి కృష్ణా యాదవ్ కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. వీరిద్దరి భర్త వీరి కోసం రాజకీయ వ్యూహాలను సిద్ధం చేస్తుంటారు. ఖగడియా అసెంబ్లీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన పూనమ్ జేడీయూ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తుంటారు.



2015 అసెంబ్లీ ఎన్నికల్లో పూనమ్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆమె ఆస్తిపాస్తుల విలువ మొత్తం 41 కోట్ల 34 లక్షల 45 వేల 969 రూపాయలు. 2010 తరువాత ఐదు సంవత్సరాల్లో ఆమె ఆస్తిపాస్తుల విలువ భారీగా పెరిగింది. 2010లో ఆమె ఒక కోటీ 87 లక్షల 71 వేల 624 రూపాయల ఆస్తిపాస్తులు కలిగివున్నారు. 2015లో ఎన్నికల సందర్భంగా ఆమె దాఖలు చేసిన అఫిడవిట్‌లో రూ. 35 కోట్ల విలువలైన వ్యవసాయ భూములు ఉన్నట్లు పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూనమ్ యాదవ్ సిద్ధమవుతున్నారు. పూనమ్ యాదవ్ భర్త రణవీర్ యాదవ్. ఈయనపై హత్యా ఆరోపణలున్న నేపధ్యంలో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. రణవీర్ యాదవ్ స్థానికంగా ‘బాహుబలి నేత’గా పేరొందారు. 1990 ఎన్నికల్లో రణవీర్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి భార్య పూనమ్ యాదవ్‌ను కూడా ఎన్నికల్లో నిలబెడుతూ వస్తున్నారు. అదేవిధంగా అతని రెండవ భార్య కృష్ణా యాదవ్... పూనమ్ యాదవ్‌కు  కవల సోదరి. వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. రాబోయే ఎన్నికల్లో కృష్ణా యాదవ్ కూడా బరిలోకి దిగుతున్నారు. వీరిద్దరి కోసం రణవీర్ యాదవ్ రాజకీయ వ్యూహాలను రూపొందిస్తున్నారు. 


Updated Date - 2020-10-03T12:12:39+05:30 IST