షాకింగ్: 50 శాతానికిపైగా కరోనా టీకాలు ఆ దేశాలవే..!

ABN , First Publish Date - 2020-09-17T18:37:21+05:30 IST

కరోనాకు ధనిక-పేద తారతమ్యాలు లేవేమో కానీ కరోనా టీకా విషయంలో ఇది నిజం కాకపోచ్చనే సందేహం ఆక్సాఫామ్ తాజా నివేదిక చూస్తే కలుగకమానదు. సంచలనం రేపుతున్న ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో జనాభాలో కేవలం 13% శాతం వాటా కలిగిన దేశాల చేత్తుల్లోనే ఏకంగా 50 శాతం కరోనా టీకాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది.

షాకింగ్: 50 శాతానికిపైగా కరోనా టీకాలు ఆ దేశాలవే..!

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు ధనిక-పేద తారతమ్యాలు లేవేమో కానీ కరోనా టీకా విషయంలో ఇది నిజం కాకపోచ్చనే సందేహం ఆక్సాఫామ్ తాజా నివేదిక చూస్తే కలుగకమానదు. సంచలనం రేపుతున్న ఈ నివేదిక ప్రకారం.. ప్రపంచంలో జనాభాలో కేవలం 13% శాతం వాటా కలిగిన దేశాల చేత్తుల్లోనే ఏకంగా 50 శాతం కరోనా టీకాలు ఉన్నాయని వెలుగులోకి వచ్చింది.


టీకాలు కొనుగోలు చేసేందుకు అమెరికా, బ్రిటన్, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, స్వీట్జర్‌ల్యాండ్ దేశాలు కరోనా రూపకల్పనలో ఉన్న ఐదు సంస్థలతో ఈ మేరకు ఒప్పందాలు చేసుకున్నాయని ఆక్స్‌ఫామ్ వెల్లడించింది.


ప్రముఖ ఫార్మా కంపెనీలు ఆస్ట్రా జెనెకా, గెమెలేయా, మోడర్నా, ఫైజర్, సైనోవాక్ కంపెనీల టీకాల అభివృద్ధి ప్రస్తుతం వివిధ దశల్లో ఉంది. ఆయా దేశాలు ఈ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను విశ్లేషించిన మీదట ఆక్స్‌ఫామ్ ఈ అంచనాకు వచ్చింది. ఈ ఐదు కంపెనీల ఉత్పత్తి సామరథ్యం 5.9 బిలియన్ డోసులని, ఒక్కో వ్యక్తికీ రెండు డోసుల అవసరం ఉండటంతో ఇది 3 బిలియన్ మందికి సరిపోతుందని ఆక్స్‌ఫామ్ లెక్కగట్టింది.


ఇప్పటివరకూ 5.3 బిలియన్ డోసులకు సంబంధించి ఒప్పందాలు కుదరగా.. అందులో సగానికిపైగానే అంటే దాదాపు 2.7 డోసుల(51శాతం) కోసం అమెరికా, బ్రిటన్, ఐరోపా సమాఖ్య, ఆస్ట్రేలియా, హాంగ్‌కాంగ్, జపాన్, స్విట్జర్‌ల్యాండ్, ఇజ్రాయెల్ అగ్రిమెంట్లు చేసుకున్నాయి. ఇక మిగిలిన 2.6 డోసుల కోసం భారత్, బాంగ్లాదేశ్, చైనా, బ్రెజిల్, ఇండోనేషియా, మెక్సికో వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆక్స్‌ఫామ్ తన నివేదికలో పేర్కొంది.

Updated Date - 2020-09-17T18:37:21+05:30 IST