12 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షసూచన

ABN , First Publish Date - 2020-05-13T13:26:36+05:30 IST

ఉష్ణచలనం కారణంగా రానున్న 24 గంటల్లో అరియలూరు, కడలూరు సహా 12 జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు..

12 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షసూచన

చెన్నై: ఉష్ణచలనం కారణంగా రానున్న 24 గంటల్లో అరియలూరు, కడలూరు సహా 12 జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశముందని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు.. ఉష్ణచలనం కారణంగా అరియలూరు, కడలూర్‌, విల్లుపురం, తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్టణం, పుదుకోట, రామనాథపురం, శివగంగ, తిరునల్వేలి, తూత్తుకుడి, కన్నియకుమారి జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కరుస్తుందని, అలాగే, కన్నియకుమారి, నాగపట్టణం జిల్లాల్లోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీవర్షం కురిసే అవకాశముందని  వారు వివరించారు. 

Read more