దూబే తలపై రివార్డును భారీగా పెంచిన యోగి సర్కార్!

ABN , First Publish Date - 2020-07-08T19:29:59+05:30 IST

ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై రివార్డును..

దూబే తలపై రివార్డును భారీగా పెంచిన యోగి సర్కార్!

లక్నో: ఎనిమిది మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉత్తర ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబేపై రివార్డును భారీగా పెంచుతూ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతడిని పట్టించిన వారికి ప్రకటించిన రూ. 2.5 లక్షల రివార్డును రూ. 5 లక్షలకు పెంచినట్టు అధికారులు వెల్లడించారు. ‘‘వికాస్ దూబే అరెస్టుపై ఉన్న నగదు రివార్డును రూ.5 లక్షలకు పెంచడం జరిగింది. అతడి ఆచూకీ చెప్పిన వారికి ఈ మొత్తాన్ని బహుమతిగా ఇస్తాం..’’ అని అదనపు చీఫ్ సెక్రటరీ అవనీశ్ కుమార్ అవస్తి వెల్లడించారు.  ఈ నెల 3న కాన్పూర్‌లోని బిక్రులో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో దూబే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 

Updated Date - 2020-07-08T19:29:59+05:30 IST