గుజరాత్ నుండి మధ్యప్రదేశ్ కు 2400 మంది వలస కార్మికులు

ABN , First Publish Date - 2020-04-26T11:49:58+05:30 IST

దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ మధ్య, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు స్వరాష్ట్రానికి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర...

గుజరాత్ నుండి మధ్యప్రదేశ్ కు 2400 మంది వలస కార్మికులు

భోపాల్: దేశంలో కొనసాగుతున్న లాక్డౌన్ మధ్య, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కార్మికులు స్వరాష్ట్రానికి  తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం తమ రాష్ట్ర కార్మికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీలోని వివిధ జిల్లాల్లో చిక్కుకున్న కార్మికులను వారివారి గ్రామాలకు తరలిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. రాజస్థాన్ నుంచి ఎంపీ  ప్రభుత్వం కూలీలను తిరిగి తీసుకువస్తోందని, గుజరాత్ నుంచి 98 బస్సుల్లో 2400 మంది కార్మికులు బయలుదేరారని ఆయన తెలిపారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ మార్గదర్శకాలను అనుసరిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. మధ్యప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్న వలస కార్మికులకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు  చేసిన తరువాతనే వారిని వారి ఇంటికి పంపిస్తామన్నారు. గుజరాత్ నుండి 2400 మంది కార్మికులు మధ్యప్రదేశ్ లోని జాబులా జిల్లాకు వచ్చారు. అక్కడ వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2020-04-26T11:49:58+05:30 IST