60 సెకన్లలో కరోనా ఫలితమిచ్చే ‘స్మార్ట్‌ఫోన్’ సెన్సర్
ABN , First Publish Date - 2020-05-09T09:33:09+05:30 IST
కరోనా ఉందో.. లేదో తెలుసుకోవడానికి ఇక స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు!! కేవలం 60 సెకన్లలోనే ఫలితం మీ కళ్లెదుట ప్రత్యక్షమవుతుంది. ఉమ్మి శాంపిల్‌తో అతిస్వల్ప వ్యవధిలోనే కరోనాను
న్యూఢిల్లీ, మే 8: కరోనా ఉందో.. లేదో తెలుసుకోవడానికి ఇక స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు!! కేవలం 60 సెకన్లలోనే ఫలితం మీ కళ్లెదుట ప్రత్యక్షమవుతుంది. ఉమ్మి శాంపిల్‌తో అతిస్వల్ప వ్యవధిలోనే కరోనాను నిర్ధారించగల శక్తిమంతమైన సెన్సర్‌ను అమెరికాలోని ఉతా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. చిన్న సైజులో ఉండే ఈ సెన్సర్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానించి.. దానిపై ఒక చుక్క ఉమ్మి శాంపిల్‌ను వేయాలి. యాప్ ఒకటి ఈ ఉమ్మి శాంపిల్‌ను విశ్లేషించి 60 సెకన్లలో ఫలితాన్ని తెరపై చూ పిస్తుంది.