సెల్ఫ్ ఐసోలేషన్ నియమాల ఉల్లంఘన... ముగ్గురికి జైలు

ABN , First Publish Date - 2020-03-28T14:24:40+05:30 IST

కోవిడ్ -19 మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోతోంది. దీంతో పలుదేశాలు ఇప్పుడు తమ పౌరులను ఈ వైరస్ నుంచి రక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి.

సెల్ఫ్ ఐసోలేషన్ నియమాల ఉల్లంఘన... ముగ్గురికి జైలు

బెల్ గ్రేడ్: కోవిడ్ -19 మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోతోంది. దీంతో పలుదేశాలు ఇప్పుడు తమ పౌరులను ఈ వైరస్ నుంచి రక్షించడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. సెర్బియాలో స్వీయ నిర్బంధ నియమాన్ని సరిగా పాటించని వారికి కఠిన శిక్షలు విధిస్తున్నారు. సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ముగ్గురు వ్యక్తులకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా సెర్బియా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కోవిడ్ -19 నియంత్రణకు అవసరమైన నియమాలను ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. సెర్బియాలో ఇప్పటివరకు 528 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 8 మంది మరణించారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం .. ముగ్గురు సెర్బియా పౌరులు విదేశీ ప్రయాణాల ముగించుకొని  స్వదేశానికి తిరిగి వచ్చారు. వైద్య నిబంధనల ప్రకారం వారు 14 నుంచి 28 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండవలసి వచ్చింది. అయితే  వారు ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. దీనితో స్థానిక పోలీసులు వారిని అరెస్టు చేసి,  జైలుకు తరలించారు.


Updated Date - 2020-03-28T14:24:40+05:30 IST