మహిళకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్యులపై బంధువుల దాడి

ABN , First Publish Date - 2020-04-28T15:06:14+05:30 IST

స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన ఓ 60 సంవత్సరాల మృతురాలికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్యులపై మృతురాలి

మహిళకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్యులపై బంధువుల దాడి

అంబాలా: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన ఓ 60 సంవత్సరాల మృతురాలికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్యులపై మృతురాలి బంధువులు రాళ్లురువ్విన ఘటన హరియాణాలో చోటు చేసుకుంది. అంబాలా ప్రాంతంలోని చంద్రపురా గ్రామానికి చెందిన మృతురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వచ్చిన పోలీసులు, వైద్యులను ఆమె బంధువులు అడ్డుకున్నారు. ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారణ కానప్పటికీ.. ఆమె అంత్యక్రియలు నిర్వహించవద్దని వాళ్లు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా వాళ్లు వైద్యులపై రాళ్లదాడికి పాల్పడటంతో.. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి.. వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు.


‘‘ఆస్తామాతో సోమవారం ఆస్పత్రిలో ఆమె మా ఆస్పత్రిలో చేరింది. ఊపిరి తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది ఎదురుకుంటున్న ఆమె వైద్యం జరుగుతుండగానే ప్రాణాలు కోల్పోయింది. అమె నమూనాలను సేకరించి.. కోవిడ్-19 పరీక్షల కోసం పంపించాము. అన్ని నిబంధనలు పాటిస్తూ.. జిల్లా అధికారులు సూచించిన ప్రాంతంలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకువచ్చాము’’ అంటూ డాక్టర్ కుల్దీప్ సింగ్ తెలిపారు. 


ఆమె అంత్యక్రియులు నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. కానీ మృతురాలి బంధువుల అనూహ్యంగా తమపై దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వాళ్లు మాట వినలేదని తెలిపారు. 


‘‘మేము అన్ని జాగ్రత్తలతో అంత్యక్రియలు చేస్తున్నామని వాళ్లకి నచ్చజెప్పాము. కానీ, వాళ్లు మా మాటలు వినకుండా.. రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఒక అంబులెన్సును కూడా ధ్వంసం చేశారు. దీంతో మేము బలవంతంగా వారిని అక్కడి నుంచి తరిమేయాల్సి వచ్చింది’’ అని డీఎస్‌పీ రామ్ కుమార్ అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై లాక్‌డౌన్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-28T15:06:14+05:30 IST