అలుగు.. నిరోధకతపై వెలుగు!

ABN , First Publish Date - 2020-05-11T07:48:05+05:30 IST

కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి అలుగులకు వాటి నుంచి మనుషులకు వ్యాపించిందనే ప్రచారం ఇటీవల విస్తృతంగా జరిగింది. ఒకవేళ ఇదే నిజమై ఉంటే.. అలుగుల్లోకి ప్రవేశించిన వైరస్‌ వాటికి ఇన్ఫెక్షన్‌ ఎందుకు...

అలుగు.. నిరోధకతపై వెలుగు!

  • కొవిడ్‌-19కు లొంగని క్షీరదంగా శాస్త్రవేత్తల గుర్తింపు


న్యూఢిల్లీ, మే 10: కరోనా వైరస్‌ గబ్బిలాల నుంచి అలుగులకు వాటి నుంచి మనుషులకు వ్యాపించిందనే ప్రచారం ఇటీవల విస్తృతంగా జరిగింది. ఒకవేళ ఇదే నిజమై ఉంటే.. అలుగుల్లోకి ప్రవేశించిన వైరస్‌ వాటికి ఇన్ఫెక్షన్‌ ఎందుకు కలిగించలేకపోతోంది ? ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుకుతూ ఆస్ట్రియాలోని వియన్నా మెడికల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగాల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అలుగుల జన్యుక్రమాన్ని విశ్లేషించి.. ఆ వివరాలను మనుషులు, పిల్లులు, కుక్కలు, పశువుల వంటి ఇతర క్షీరదాల జన్యుక్రమాలతో పోల్చిచూశారు. దీంతో అలుగుల్లోని వైరస్‌ నిరోధక వ్యవస్థ 20 మిలియన్‌ ఏళ్ల నుంచీ ఇతర క్షీరదాల కంటే చాలా భిన్నంగా ఉన్నట్లు వెల్లడైంది. వైర్‌సలు శరీరంలోకి ప్రవేశించగానే స్పందించి వ్యాధి నిరోధక వ్యవస్థను చైతన్యపరిచే రెండు జన్యువులు అలుగుల్లో లేవని గుర్తించారు. ఈ కారణం వల్లే అవి తమలోకి చొరబడే కరోనా వైర్‌సలను ఎలాంటి ప్రతిఘటన లేకుండా భరించగలుగుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై మరిన్ని ప్రయోగాలు జరగాలని శాస్త్రవేత్తలు చెప్పారు. 


Updated Date - 2020-05-11T07:48:05+05:30 IST