బీజేపీలో చేరికపై అళగిరి స్పందన ఇదీ..!

ABN , First Publish Date - 2020-12-02T05:10:41+05:30 IST

తాను బీజేపీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలపై డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి స్పందించారు....

బీజేపీలో చేరికపై అళగిరి స్పందన ఇదీ..!

చెన్నై: తాను బీజేపీలో చేరబోతున్నానంటూ వస్తున్న వార్తలపై డీఎంకే బహిష్కృత నేత ఎంకే అళగిరి స్పందించారు. అవన్నీ ‘‘వదంతులే’’నంటూ ఆయన కొట్టిపారేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సొంత పార్టీ ప్రారంభించడంపై తన మద్దతుదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కొత్తపార్టీ గురించి కొద్దిరోజుల్లోనే వివరాలు వెల్లడిస్తానని అళగిరి పేర్కొన్నారు. తన సోదరుడు, డీఎంకే కొత్త చీఫ్ ఎంకే స్టాలిన్‌తో విబేధాలు వచ్చిన నేపథ్యంలో 2014లో అళగిరిపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో ఆయనను పక్కనబెట్టారు. కాగా డీఎంకేలో తన కుమారుడు దురై దయానిధికి పదవి ఆఫర్ చేసినట్టు వచ్చిన వార్తలనూ అళగిరి కొట్టిపారేశారు. అవన్నీ కేవలం ‘‘ఊహాగానాలు’’, పుకార్లేనని ఆయన తేల్చిచెప్పారు.

Updated Date - 2020-12-02T05:10:41+05:30 IST