ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటనపై శశి థరూర్ సెటైర్లు

ABN , First Publish Date - 2020-05-13T21:41:11+05:30 IST

కరోనా వేళ ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించారు. దానితో పాటు ఆత్మనిర్భర్ భారత్ అనే కొత్త నినాదాన్ని ఇచ్చారు. కాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సెటైర్లు వేశారు.

ప్రధాని మోదీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటనపై శశి థరూర్ సెటైర్లు

న్యూఢిల్లీ: కరోనా వేళ ప్రధాని మోదీ 20 లక్షల కోట్ల రూపాయల భారీ ప్యాకేజీ ప్రకటించారు. దానితో పాటు ఆత్మనిర్భర్ భారత్ అనే కొత్త నినాదాన్ని ఇచ్చారు. కాగా దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ సెటైర్లు వేశారు. పాత సింహాల్ని కొత్త పేర్లతో అమ్ముతున్నట్లు ఆయన వ్యంగ్యాస్త్రాలు వేశారు. మేక్ ఇన్ ఇండియాకు ఇది నూతన పేరని ఎద్దేవా చేశారు.


మేక్ ఇన్ ఇండియా లోగోకు రిపేర్లు చేస్తున్నట్టుండే ఓ ఇమేజీని తన ట్విట్టర్ అధికారిక ఖాతాలో షేర్ చేసిన శశిథరూర్ వ్యంగ్యంగా మోదీపై విమర్శలు గుప్పించారు. ‘‘అవే పాత సింహాలు.. కాకపోతే ఇప్పుడు కొత్త పేరుతో అమ్ముతున్నారు. స్వప్నాల్ని ఆంకాంక్షల్ని మళ్లీ మళ్లీ అమ్మారు. మేక్ ఇన్ ఇండియానే ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్‌గా మారింది. ఇంత కంటే కొత్తగా ఏమైనా ఉందా అందులో?’’ అని హిందీలో ఆయన ట్వీట్ చేశారు.

Updated Date - 2020-05-13T21:41:11+05:30 IST