క‌రోనా కాలంలో 15 శాతం మేరకు జీతాలు పెంచిన రెనాల్ట్‌ ఇండియా!

ABN , First Publish Date - 2020-06-04T16:14:57+05:30 IST

కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి లాక్‌డౌన్ విధించిన నేప‌ధ్యంలో వివిధ కంపెనీల్లో తొలగింపులు లేదా జీతాల్లో కోతలు ఉంటున్నాయి. అయితే ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్ ఇండియా తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.

క‌రోనా కాలంలో 15 శాతం మేరకు జీతాలు పెంచిన రెనాల్ట్‌ ఇండియా!

న్యూఢిల్లీ: కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి లాక్‌డౌన్ విధించిన నేప‌ధ్యంలో వివిధ కంపెనీల్లో తొలగింపులు లేదా జీతాల్లో కోతలు ఉంటున్నాయి. అయితే ఫ్రెంచ్ ఆటోమొబైల్ కంపెనీ రెనాల్ట్ ఇండియా తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థలో ప‌నిచేస్తున్న‌ 250 మంది ఉద్యోగుల జీతాలను 15 శాతం వరకు పెంచుతున్న‌ట్లు ప్ర‌కటించింది. సంస్థ‌ 2019లో కంపెనీ గణనీయమైన లాభాలను నమోదు చేసింది. లాక్‌డౌన్ కార‌ణంగా అమ్మకాలు బాగా క్షీణించినా గ‌డచిన‌ ఆగస్టు నుంచి సిబ్బందికి జీతాలు పెంచుతున్న‌ట్లు రెనాల్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. రాబోయే పండుగ సీజన్‌లో ఎస్‌యూవీ అమ్మకాలు ఆశాజ‌న‌కంగా ఉంటాయ‌ని  కంపెనీ భావిస్తోంది. కంపెనీని అభివృద్ధి బాట‌లో న‌డిపించేందుకు ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని అందించాల‌ని కంపెనీ నిర్ణ‌యించింది. 

Updated Date - 2020-06-04T16:14:57+05:30 IST