అక్కడ కరోనా బారినపడ్డ చిట్టచివరి దేశం ఇదే..!

ABN , First Publish Date - 2020-05-14T02:16:08+05:30 IST

ఆప్రీకా ఖండం మొత్తం కరోనా పడగ నీడలోకి వచ్చేసింది. లసోఠో దేశంలో బుధవారం తొలి కరోనా కేసు నమోదవడంతో కరోనా మహమ్మారి ఆఫ్రికా ఖండం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది.

అక్కడ కరోనా బారినపడ్డ చిట్టచివరి దేశం ఇదే..!

జొహాన్నెస్‌బర్గ్: ఆఫ్రికా ఖండం మొత్తం కరోనా పడగ నీడలోకి వచ్చేసింది. లసోఠో దేశంలో బుధవారం తొలి కరోనా కేసు నమోదవడంతో కరోనా మహమ్మారి ఆఫ్రికా ఖండం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. సౌదీ, దక్షిణాఫ్రికాల నుంచి ఆ దేశానికి వచ్చిన వారిపై జరిపిన 81 పరీక్షల్లో 2 కరోనా కేసులు బయటపడ్డాయని లసోఠో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో 301 టెస్టులు ఫలితాలు ఇంకా రావాల్సి ఉన్నట్టు తెలిసింది. లసోఠో పొరుగు దేశమైన దక్షిణాఫ్రికాలో 10 వేల పై చిలుకు కరోనా కేసులు నమోదైనప్పటికీ లసోఠోలో మాత్రం తొలి కేసు బుధవారం నాడు నమోదైంది. మరోవైపు.. అక్కడ అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంటులో మెజారిటీ కోల్పోవడంతో ప్రధాని మరి కొద్ది రోజుల్లో రాజీనామా చేయనున్నారు. దేశం ఇలా రాజకీయం సంక్షోభంలో కూరుకుపోతున్న సమయంలో అక్కడ కరోనా అడుగుపెట్టడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Updated Date - 2020-05-14T02:16:08+05:30 IST