సామూహిక ప్రార్థనా కార్యక్రమాలు కరోనా ఉధృతికి కారణం: డబ్ల్యూహెచ్ఓ

ABN , First Publish Date - 2020-06-23T20:14:12+05:30 IST

కరోనా మహమ్మారి అదుపులోకొచ్చిన అనేక దేశాల్లో వైరస్ మళ్లీ బుసలు కొడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

సామూహిక ప్రార్థనా కార్యక్రమాలు కరోనా ఉధృతికి కారణం: డబ్ల్యూహెచ్ఓ

జెనీవా: కరోనా మహమ్మారి అదుపులోకొచ్చిన అనేక దేశాల్లో వైరస్ మళ్లీ బుసలు కొడుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా దేశాల్లో క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. లాక్ డౌన్లను ఎత్తేస్తూ అనేక సాధారణ కార్యకలాపాలకు అనుమతినివ్వడమే దీనికి కారణమంది.


ముఖ్యంగా నైట్‌క్లబ్‌లు, ఇళ్లల్లో జరిగే పార్టీలు,  సామూహిక ప్రార్థనా కార్యక్రమాలు వంటివి కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయని హెచ్చరించింది. ఇలాంటి ఘటనలు సామూహిక వ్యాప్తికి దారితీసే ప్రమాదం ఉన్నందును ప్రభుత్వాలు తక్షణం పటిష్ట చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. ఒక్క అవకాశం దొరికినా మహమ్మారి మళ్లీ రెచ్చిపోతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది.


కాగా.. తమదేశంలో కరోనా రెండో సారి దాడి ప్రారంభించిందని దక్షిణ కొరియా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మే నెలలో రాజధాని సియోల్‌లో అనుమతించిన సామూహిక కార్యక్రమాలే రెండో దాడికి పునాదిగా మారాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

Updated Date - 2020-06-23T20:14:12+05:30 IST