రిలయన్స్‌ కంపెనీల్లో నెలకు రెండు సార్లు జీతాలు..

ABN , First Publish Date - 2020-03-25T04:36:30+05:30 IST

నెల జీతం 30 వేల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు నెలలో రెండు సార్లు జీతం ఇచ్చేందుకు రిలయన్స్ ఇండస్‌స్ట్రీస్ నిర్ణయించింది.

రిలయన్స్‌ కంపెనీల్లో నెలకు రెండు సార్లు జీతాలు..

ముంబై: నెల జీతం 30 వేల కంటే తక్కువ ఉన్న ఉద్యోగులకు నెలలో రెండు సార్లు జీతం ఇచ్చేందుకు రిలయన్స్ ఇండస్‌స్ట్రీస్ నిర్ణయించింది. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వారికి డబ్బుల కటకట ఏర్పడకుండా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో కాంట్రాక్ట్, తాత్కాలిక ఉద్యోగులకు కూడా లాక్ డౌన్ సమయంలో జీతాలు చెల్లించేందుకు నిర్ణయించింది. ఇక వర్క్ ఫ్రమ్ హోం విధానం విషయంలోనూ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. సంక్లిష్టమైన బాధ్యతల్లో ఉన్న ఉద్యోగులు తప్ప మిగతా వారందరూ ఇంటి నుంచే పనిచేయచ్చని సూచించింది.

Read more