సెన్సెక్స్ 300 పాయింట్లు అప్... రూ. 2 వేలు దాటిన రిలయన్స్

ABN , First Publish Date - 2020-11-06T23:28:02+05:30 IST

నిన్న భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఈ రోజు కూడా అదే ఒరవడిని కొనసాగించాయి. ఉదయం గం. 9.17 సమయానికి సెన్సెక్స్ 62.39 పాయింట్లు(0.15%) లాభపడి 41,402.55 వద్ద, నిఫ్టీ 17.70 పాయింట్లు(0.15%) లాభపడి 12,138 పాయింట్ల వద్ద ముగిశాయి.

సెన్సెక్స్ 300 పాయింట్లు అప్... రూ. 2 వేలు దాటిన రిలయన్స్

ముంబై : నిన్న భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు ఈ రోజు కూడా అదే ఒరవడిని కొనసాగించాయి. ఉదయం గం. 9.17 సమయానికి సెన్సెక్స్ 62.39 పాయింట్లు(0.15%) లాభపడి 41,402.55 వద్ద, నిఫ్టీ 17.70 పాయింట్లు(0.15%) లాభపడి 12,138 పాయింట్ల వద్ద ముగిశాయి.


మధ్యాహ్నం గం.11.45 సమయానికి సెన్సెక్స్ 306 పాయింట్లు లాభపడి 41,646 వద్ద ట్రేడ్ అయింది. ఓ సమయంలో 41,659ని తాకడం విశేషం. ఇక... 588 షేర్లు లాభాల్లో, 299 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 46 షేర్లలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. ఇక... బ్యాంకింగ్ వంటి రంగాలు లాభాల్లో ఉండగా, ఐటీ, ఎఫ్ఎసీజీ రంగాలు నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టీ ఎనర్జీ ఒక శాతానికి పైగా ఎగసింది. మరోవైపు ఫార్మా మాత్రం ఒత్తిడిలో ఉంది.


కాగా... రూ. 2 వేలు దాటిన రిలయన్స్ గతవారం నాటి సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో  ఈ వారం మొదటి రెండు సెషన్లలో మాత్రం కుప్పకూలిన విషయం తెలిసిందే. స్టాక్ ఏకంగా రూ. 1,900 దిగువకు వచ్చింది. అయితే మూడు రోజులుగా కుదురుకుంటోంది. ఇదిలా ఉండగా... రిలయన్స్ అనుబంధ సంస్ధ రిలయన్స్ వెంచర్స్‌లోకి సౌదీ పెట్టుబడులు వచ్చాయి. ఈ నేపథ్యంలో నేడు ఈ స్టాక్ మధ్యాహ్నం గం.11.30 సమయానికి 3 శాతానికి పైగా లాభపడి రూ.2,017 వద్ద ట్రేడ్ అయింది. ఐదో సెషన్‌లో రూ. 2 వేల మార్క్‌ను దాటింది. ఇటీవల రిలయన్స్ స్టాక్ పతనం నేపథ్యంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 13 లక్షల కోట్ల దిగువకు చేరుకున్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-11-06T23:28:02+05:30 IST