భారత తొలి కరోనా ఆసుపత్రిని ప్రారంభించిన రిలయన్స్ ఫౌండేషన్
ABN , First Publish Date - 2020-03-24T02:39:54+05:30 IST
కరోనా కల్లోలం ప్రబలుతున్న నేపథ్యంలో తన వంతు బాధ్యత నిర్వహించేందుకు ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగింది.

ముంబై: కరోనా కల్లోలం ప్రబలుతున్న నేపథ్యంలో తన వంతు బాధ్యత నిర్వహించేందుకు ముఖేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రంగంలోకి దిగింది. కరోనా పేషెంట్ల కోసం వంద పడకల ప్రత్యేక వసతిని ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. ముంబై మహానగర పాలిక, సర్ హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ వసతిని ఏర్పాటు చేశాయి. వ్యాధి కారక క్రిముల వ్యాప్తిని నిరోధించే నెగెటివ్ ప్రేజర్ గదిని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. కేవలం 15 రోజుల్లోనే ఈ 100 పడకల వసతిని ఏర్పాటు చేసినట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వెంటిలేటర్లు, పేస్ మేకర్లు, డయాలిసిస్ పరికరాలు వంటి అత్యాధునిక సౌకర్యాలు ప్రతి బెడ్ వద్దా అందుబాటులో ఉంటాయని సదరు ఫౌండేషన్ తెలిపింది.