వచ్చే ఏడాది జియో 5జీ?.. ప్రకటించిన అంబానీ

ABN , First Publish Date - 2020-07-15T22:40:31+05:30 IST

తమ కంపెనీ పూర్తిగా కొత్తదైన 5జీ సిస్టంను సిద్ధం చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించారు.

వచ్చే ఏడాది జియో 5జీ?.. ప్రకటించిన అంబానీ

ముంబై: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తమ కంపెనీ 5జీ సిస్టంను సిద్ధం చేసిందని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ వెల్లడించారు. బుధవారం ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. తద్వారా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 5జీ వ్యవస్థను దేశంలో విడుదల చేసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ‘సున్నా నుంచి ఈ 5జీ వ్యవస్థను తయారుచేశాం. 5జీ స్పెక్ట్రమ్ అందుబాటులోకి రాగానే దీని ట్రయల్స్ ప్రారంభిస్తాం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ఈ కొత్త 5జీ వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం’ అని అంబానీ పేర్కొన్నారు.

Updated Date - 2020-07-15T22:40:31+05:30 IST