ఆపిల్ తర్వాత... రిలయెన్సే
ABN , First Publish Date - 2020-08-06T23:03:02+05:30 IST
అతిపెద్ద బ్రాండ్ల విషయంలో... ప్రపంచంలోనే రెండో స్థానం దక్కించుకుంది ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తర్వాతి స్థానం.... రిలయన్స్దేనని ప్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 జాబితాలో వెల్లడైంది.
ముంబై : అతిపెద్ద బ్రాండ్ల విషయంలో... ప్రపంచంలోనే రెండో స్థానం దక్కించుకుంది ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ తర్వాతి స్థానం.... రిలయన్స్దేనని ప్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ 2020 జాబితాలో వెల్లడైంది.
ఇక... మూడవ స్థానంలో సామ్సంగ్, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎన్విడియా, మౌటాయ్, నైక్, మైక్రోసాఫ్ట్, ఏఎస్ఎంఎల్, పేపల్, నెట్ఫ్లిక్స్ సంస్థలున్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ వృద్ధిపథంలో దూసుకుపోతోందని, కష్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తూ, కొత్త ఆలోచనలతో పరుగులు పెడుతోందని ప్యూచర్ బ్రాండ్ ఈ సందర్భంగా పేర్కొంది.
గడచిన ఆరేళ్ళలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయని, సంస్థల ప్రాధాన్యాలు కూడా మారాయని ఈ నివేదిక వెల్లడించింది.