రైళ్ల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
ABN , First Publish Date - 2020-08-11T23:45:23+05:30 IST
రైళ్ల పున: ప్రారంభానికి సంబంధించి రకరకాల ప్రచారాలు తెరపైకొస్తున్న నేపథ్యంలో భారత్‌లో...

న్యూఢిల్లీ: రైళ్ల పున: ప్రారంభానికి సంబంధించి రకరకాల ప్రచారాలు తెరపైకొస్తున్న నేపథ్యంలో భారత్‌లో రైళ్ల రాకపోకలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తదుపరి ప్రకటన వచ్చే వరకూ రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లు, సబర్బన్ రైళ్ల రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. ఇప్పటికే రాకపోకలు సాగిస్తున్న 230 స్పెషల్ ట్రైన్స్ సేవలు కొనసాగుతాయని తెలిపింది.
ముంబైలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు పరిమిత సంఖ్యలో లోకల్ ట్రైన్స్ నడపనున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే.. జూన్ 25న రైల్వే శాఖ జారీ చేసిన ఆదేశాల్లో ఆగస్ట్ 12 వరకూ సాధారణ రైల్వే సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఆగస్ట్ 12 సమీపిస్తుండటంతో భారత ప్రభుత్వం తాజాగా ఈ ప్రకటన చేసింది.