అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై పర్యావరణ ఆడిట్ జరిపి, పరిహారం రాబట్టాలి: ఎన్‌జీటీ

ABN , First Publish Date - 2020-09-13T17:47:16+05:30 IST

ప్యాకేజింగ్ కోసం ప్లాస్టిక్ వినియోగిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ కార్యకలాపాలను ముదింపు వేసి పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఆదేశించింది.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌పై పర్యావరణ ఆడిట్ జరిపి, పరిహారం రాబట్టాలి: ఎన్‌జీటీ

న్యూఢిల్లీ: ప్యాకేజింగ్ కోసం అధికంగా ప్లాస్టిక్ వినియోగిస్తున్న అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ కార్యకలాపాలను ముదింపు వేసి పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డును ఆదేశించింది. పర్యవరణ చట్టాలను అమలు చేయాల్సిన సంస్థలు ఇటువంటి సంస్థలపై ఒత్తిడి తెచ్చే పలు చర్యలను చేపట్టట్లేదని ఎన్‌జీటీ వ్యాఖ్యానించింది. కాలుష్యానికి కారణమైన వారే పరిహారం చెల్లించాలనే సూత్రాన్ని ఈ కామర్స్ సంస్థల విషయంలో కాలుష్య నియంత్రణ బోర్డు వర్తింపచేయట్లేదని అభిప్రాయపడింది.


‘కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు దాఖలు చేసిన రిపోర్టులో..ఈ కామర్స్ సంస్థలపై చర్యలు తీసుకోలేకపోవడానికి గల కారణాల ప్రస్తావన మాత్రమే ఉంది. అయితే చట్టాలు అమలయ్యేలా ఒత్తిడి తెచ్చేందుకు బోర్టులు ఏమి చేశాయనే దాని ప్రస్తావన లేదు’ అని ఎన్‌జీటీ చైర్మన్ జస్టిస్ ఏకే గోయల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ సంస్థలపై పర్యావరణ ఆడిట్(ముదింపు) జరిపే అంశాన్ని కాలుష్య నియంత్రణ బోర్డు పరిశీలించాలని ఆయన సూచించారు.


చట్టాల ఉల్లంఘన జరిగిందని తేలితే సదరు సంస్థల నుంచి పరిహారం రాబట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంలో కాలుష్య నియంత్రణ బోర్డు ఏయే చర్యలు తీసుకుదన్నదీ ఈ మెయిల్ ద్వారా అక్టోబర్ 14లోపు ఎన్‌జీటీకి తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2020-09-13T17:47:16+05:30 IST