రాజధానిలో రికార్డు స్థాయికి పడిపోయిన వాయుకాలుష్యం
ABN , First Publish Date - 2020-09-01T21:28:44+05:30 IST
యిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కల ప్రకారం.. గాలిలో కాలుష్యం 0-50 మధ్య ఉంటే ‘గుడ్’, 51-100 మధ్య ‘సాధారణం’, 101-200 మధ్య మోస్తరు, 201-300 మధ్య ‘పూర్’, 301-400 ‘వెరీ పూర్’, 401-500 మధ్య

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం కనిష్ట స్థాయికి పడిపోయింది. కొంత కాలంగా వాయుకాలుష్యంతో హస్తినపురంలో డేంజర్ బెల్స్ మొగుతూ వస్తున్న నేపథ్యంలో కరోనాతో విధించిన లాక్‌డౌన్ కాస్త ఊరటనిచ్చింది. సోమవారం నాడు నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 41 నమోదైందని కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ) పేర్కొంది. 2015 నుంచి ఇదే అత్యంత తక్కువని పీసీబీ తెలిపింది.
ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కల ప్రకారం.. గాలిలో కాలుష్యం 0-50 మధ్య ఉంటే ‘గుడ్’, 51-100 మధ్య ‘సాధారణం’, 101-200 మధ్య మోస్తరు, 201-300 మధ్య ‘పూర్’, 301-400 ‘వెరీ పూర్’, 401-500 మధ్య ‘తీవ్రం’ ఉన్నట్లు.. ఇక 500కి మించి నమోదైతే ‘ఎమర్జెన్సీ’ కేటగిరీలో ఉన్నట్లు.
ఢిల్లీలో సోమవారం నమోదైన కాలుష్యం ప్రస్తుతం ‘గుడ్’. ఈ యేడాదిలో ఢిల్లీలో ఈ స్థాయిలో నమోదు కావడం ఇది ఐదోసారి. మార్చి 28న 45, ఆగస్టు 13న 50, ఆగస్టు 20న 50, ఆగస్టు 24న 45 నమోదైంది. గత నెల ఆగస్టు మొత్తంలో 50-70 మధ్యే వాయు కాలుష్యం నమోదైందని పీసీబీ అధికారి ఒకరు పేర్కొన్నారు.