ఢిల్లీలో భీకరంగా పెరుగుతున్న కరోనా మరణాలు.. నేడు ఒక్క రోజే..

ABN , First Publish Date - 2020-05-24T21:41:13+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు భీకరంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 508 కేసులు వెలుగు

ఢిల్లీలో భీకరంగా పెరుగుతున్న కరోనా మరణాలు.. నేడు ఒక్క రోజే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు భీకరంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 508 కేసులు వెలుగు చూసినట్టు ఈ రోజు ప్రభుత్వం ప్రకటించింది. తాజా కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 13,418కి పెరినట్టు తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 30 మంది కరోనా కాటుకు బలైనట్టు ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా మరణాలతో కలుపుకుని ఢిల్లీలో మరణించిన వారి సంఖ్య 261కి చేరింది. మొత్తం బాధితుల్లో 6,540 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని, ఇంకా 6,617 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.  

Updated Date - 2020-05-24T21:41:13+05:30 IST