ఇండో-పసిఫిక్‌కు గుర్తింపు పెరుగుతోంది : ఎస్ జైశంకర్
ABN , First Publish Date - 2020-12-15T22:46:23+05:30 IST
ఇండో-పసిఫిక్ ఐడియాకు గుర్తింపు, ఆమోదం పెరుగుతుండటం

న్యూఢిల్లీ : ఇండో-పసిఫిక్ ఐడియాకు గుర్తింపు, ఆమోదం పెరుగుతుండటం పట్ల విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బ్రిటన్ ఫారిన్ సెక్రటరీ డొమినిక్ రాబ్‌తో జాయింట్ కాన్ఫరెన్స్ సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇండో-పసిఫిక్ గురించి భారత దేశానికి సొంత విజన్ ఉందని చెప్పారు. ఇతర దేశాన్ని కూడా తాను గుర్తిస్తానన్నారు. దీనిపై భారత్, బ్రిటన్ విజన్‌లో ఓవర్‌ల్యాప్స్ ఉండవచ్చునన్నారు. పెద్ద ఓవర్‌ల్యాప్స్, స్వల్ప భేదాలు ఉండవచ్చునన్నారు. ఇండో-పసిఫిక్ ఐడియాకు గుర్తింపు, ఆమోదం పెరుగుతుండటం సంతృప్తికరమని తెలిపారు. బ్రిటన్‌తో వివిధ రంగాల్లో కలిసి పని చేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు.
రాబ్ మాట్లాడుతూ, బ్రిటన్‌కు భారత దేశం కన్నా బలమైన భాగస్వామి మరొకటి లేదన్నారు. టెర్రరిజం, మారిటైం సెక్యూరిటీ వంటి సవాళ్ళను ఎదుర్కొనడానికి సన్నిహిత డిఫెన్స్, సెక్యూరిటీ పార్ట్‌నర్‌షిప్ అవసరమన్నారు.
హిందూ మహా సముద్రం, వెస్టర్న్, సెంట్రల్ పసిఫిక్ ఓషన్, దక్షిణ చైనా సముద్రం ప్రాంతాన్ని ఇండో-పసిఫిక్ రీజియన్ అంటారు.