వ్యక్తిగతంగా హాజరవ్వండి
ABN , First Publish Date - 2020-03-13T08:44:36+05:30 IST
రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యే లు తన ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎన్.పి.ప్రజాపతి స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా రాజీనామా...

22 మంది రెబెల్ ఎమ్మెల్యేలకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
భోపాల్,మార్చి 12: రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యే లు తన ఎదుట వ్యక్తిగతంగా హాజరవ్వాలని మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్ ఎన్.పి.ప్రజాపతి స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా రాజీనామా చేశారా లేక ఒత్తిళ్ల వల్ల చేశారా అన్న విషయంపై శుక్రవారం తన ఎదుట స్పష్టత ఇవ్వాలంటూ గురువారం వారికి నోటీసులు జారీచేసినట్లు అధికారులు చెప్పారు. మరోవైపు 16న అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కోరనున్నట్లు బీజేపీ వెల్లడించింది. ప్రభుత్వం మైనారిటీలో పడినందున బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా 16న సభలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్‌ను, శాసనసభ స్పీకర్‌ను కోరనున్నట్లు బీజేపీ చీఫ్ విప్ నరోత్తమ్ మిశ్రా తెలిపారు.
కమల్‌నాథ్ సర్కారు మెజారిటీ కోల్పోయిందని మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. స్పీకర్ ప్రజాపతి ఇప్పటికే 22 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. విశ్వాస పరీక్షకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని, అంతకుముందే ఎమ్మెల్యేల రాజీనామాల పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. జ్యోతిరాదిత్య సింధియా తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన చెంద డం వల్లే సిద్ధాంతాలను మరిచిపోయారని రాహుల్‌గాంధీ చెప్పారు. గురువారం రాహుల్ పార్లమెంటు వెలుపల విలేకరులతో మాట్లాడుతూ.. సింధియాకు బీజేపీలో గౌరవం దక్కదని, అ క్కడ సంతృప్తిగా ఉం డలేరని చెప్పారు. బెంగళూరు రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలను కలి సేందుకు వెళ్లిన మధ్య ప్రదేశ్ మంత్రులను కర్ణాటక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మంత్రులిద్దరూ కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌తో భేటీ అయ్యారు.
బీజేపీ సంకల్పం దృఢమవుతుంది: షా
జ్యోతిరాదిత్య సింధియా గురువారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలిశారు. ‘‘సింధియా చేరికతో మధ్యప్రదేశ్ ప్రజలకు సేవ చేయాలన్న బీజేపీ సంకల్పం మరింత బలోపేతమవుతుందన్న న మ్మకం నాకుంది’’ అని షా ట్వీట్ చేశారు. గురువారం కేంద్ర మంత్రి తోమర్‌తో కలిసి ప్రత్యేక విమానంలో భోపాల్ చేరుకు న్న సింధియాకు బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.