కరోనాతో ఘ్రాణశక్తి ఎందుకు తగ్గుతుందంటే..
ABN , First Publish Date - 2020-05-13T07:53:30+05:30 IST
కరోనా సోకితే ముక్కు ఘ్రాణ శక్తి సన్నగిల్లుతుందంటూ ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇందుకు కారణం తెలుసుకునేందుకు యత్నించిన అమెరికాలోని రెనో స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు...

లాస్ ఏంజెలిస్, మే 12: కరోనా సోకితే ముక్కు ఘ్రాణ శక్తి సన్నగిల్లుతుందంటూ ఇటీవల పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇందుకు కారణం తెలుసుకునేందుకు యత్నించిన అమెరికాలోని రెనో స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు కొన్ని కొత్త విషయాలను కనుగొన్నారు. కరోనా వైరస్ ముక్కు ద్వారా శ్వాసకోశ వ్యవస్థలోకి ప్రవేశించే క్రమంలో ఏసీఈ2, టీఎంపీఆర్‌ఎ్‌సఎస్2 ప్రొటీన్లను హైజాక్ చేసి తన గ్రాహకాలుగా వాడుకుంటుంది. ఆ రెండు ప్రొటీన్లు ఎలుకల ముక్కు ఎగువ భాగంలోని సస్టెంటక్యులర్ కణాల నుంచి విడుదలైనట్లు వెల్లడైంది. ముక్కు ద్వారా పీల్చే గాలి నుంచి మెదడులోని న్యూరాన్లకు వాసనలను చేరవేసేందుకు సస్టెంటక్యులర్ కణాలు మాధ్యమంగా పనిచేస్తాయి. ఇవి కరోనాతో ప్రభావితమవడంతో ఘ్రాణ శక్తి సన్నగిల్లుతోందని పేర్కొన్నారు.