ఇక విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధం: కమల్‌నాథ్
ABN , First Publish Date - 2020-12-15T08:16:57+05:30 IST
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? ఆయన ఆదివారం ఛింద్వాడాలో నిర్వహించిన ఓ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు ఈ సందేహానికి తావిస్తున్నాయి.

భోపాల్, డిసెంబరు 14: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ త్వరలోనే రాజకీయాల నుంచి తప్పుకోనున్నారా? ఆయన ఆదివారం ఛింద్వాడాలో నిర్వహించిన ఓ ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు ఈ సందేహానికి తావిస్తున్నాయి. ‘నేను విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు ఎలాంటి ఆశలూ లేవు.. ఏ పదవిపైనా అత్యాశ లేదు. ఇప్పటికే చాలా సాధించాను. నేను ఇంటి వద్దే ఉండడానికి సిద్ధంగా ఉన్నాను’ అని కమల్‌నాథ్ తెలిపారు. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్‌గానే కాకుండా ఆ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగాను ఉన్నారు.