పీఎం కేర్స్‌కు ఆర్బీఐ ఉద్యోగుల సాయం.. రూ.7 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2020-04-29T04:05:44+05:30 IST

కరోనాతో దేశం చేస్తున్న పోరాటానికి ఆర్బీఐ ఉద్యోగులు తమ వంతు చేయూతనందిచారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు...

పీఎం కేర్స్‌కు ఆర్బీఐ ఉద్యోగుల సాయం.. రూ.7 కోట్ల విరాళం

న్యూఢిల్లీ: కరోనాతో దేశం చేస్తున్న పోరాటానికి ఆర్బీఐ ఉద్యోగులు తమ వంతు చేయూతనందిచారు. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రోజు ఓ ప్రకటన విడుదల చేసింది. తమ బ్యాంకులోని ఉద్యోగులందరూ కలిసి పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.7 కోట్లకు పైగా విరాళం అందించినట్లు తెలిపింది. ‘మా ఉద్యోగులందరూ ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువరోజుల జీతాన్ని పీఎం కేర్స్‌కు అందిజేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వారంతా కలిసి రూ.7.30 కోట్లను జమచేయగలిగారు. ఆ మోత్తాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు అందజేయనున్నామ’ని ఆర్బీఐ ప్రకటించింది.


ఇదిలా ఉంటే కరోనాతో పోరాడేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 28న పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి అనేకమంది వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలతో పాటు ఉద్యోగులు, సామాన్యలు తమకు కుదిరినంత సొమ్మును విరాళంగా అందజేస్తూ కరోనా పోరాటంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు.

Updated Date - 2020-04-29T04:05:44+05:30 IST