కాంగ్రెస్, చైనా మధ్య రహస్య సంబంధాలు: రవిశంకర్ ప్రసాద్
ABN , First Publish Date - 2020-06-25T22:21:52+05:30 IST
కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చైనాతో రహస్య సంబంధాలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. రాజీవ్ ట్రస్ట్‌కు చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని, చైనాతో రహస్య సబంధాలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చైనాతో రహస్య సంబంధాలు ఉన్నట్లు ఆయన ఆరోపించారు. రాజీవ్ ట్రస్ట్‌కు చైనా ఎంబసీ నుంచి నిధులు వచ్చాయని, చైనాతో రహస్య సబంధాలు ఉండడం వల్లే ఈ నిధులు వచ్చాయని ఆయన అన్నారు. వాస్తవానికి చైనా నిధులతోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తోందని, కాంగ్రెస్ మేధావులు సైతం చైనా కోసమే పనిచేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
ఇక మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీపై సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి కుర్చీ కాపాడుకోవడానికే దేశంలో ఎమర్జెన్సీ విధించారని ఆయన విరుచుకుపడ్డారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జేపీ నారాయణ్, అటల్ బిహారీ వాజ్‌పేయి, చంద్రశేఖర్, జార్జ్ ఫెర్నాండెజ్, ఎల్‌కే అద్వాణీ లాంటి వారు జైలుకు వెళ్లిన విషయాన్ని రవిశంకర్ ప్రసాద్ గుర్తు చేసుకున్నారు.