నా ఆస్తి 1.2 కాదు 3.3 బిలియన్ డాలర్లు: రాపర్ కేనీ

ABN , First Publish Date - 2020-04-25T20:48:14+05:30 IST

వెస్ట్ ఆస్తుల విలువ 1.23 బిలియన్ డాలర్లు (9వేల కోట్ల రూపాయలకు పైగానే) ఉంటుందని ఫోర్బ్స్ చెప్పుకొచ్చింది. అయితే తన ఆస్తి 3.3 బిలియన్ డాలర్లు (25 వేల కోట్ల రూపాయలకు పైగానే) ఉంటుందని

నా ఆస్తి 1.2 కాదు 3.3 బిలియన్ డాలర్లు: రాపర్ కేనీ

న్యూఢిల్లీ: రాపర్ కేనీ వెస్ట్ అధికారికంగా బిలియనీర్ క్లబ్‌లో చేరారు. ఫోర్బ్స తాజాగా ప్రకటించిన జాబితాలో వెస్ట్‌కు ఈ ప్రాధాన్యత దక్కింది. అయితే ఫోర్బ్స్ విడుదల చేసిన ఫలితాల పట్ల వెస్ట్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన ఆస్తిని తక్కువగా చూపించారని వాస్తవానికి అందుకు రెండు రెట్ల కంటే ఎక్కువే ఉంటుందని చెప్పుకొచ్చాడు. తన ఆస్తుల విలువ ఇతరులు స్పష్టంగా తెలియదని వెస్ట్ పేర్కొన్నాడు.


వెస్ట్ ఆస్తుల విలువ 1.23 బిలియన్ డాలర్లు (9వేల కోట్ల రూపాయలకు పైగానే) ఉంటుందని ఫోర్బ్స్ చెప్పుకొచ్చింది. అయితే తన ఆస్తి 3.3 బిలియన్ డాలర్లు (25 వేల కోట్ల రూపాయలకు పైగానే) ఉంటుందని వెస్ట్ తెలిపాడు. ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాతో తాను సంతృప్తిగా లేనని, వాస్తవానికి తనను సంప్రదించి ఉంటే కచ్చితమైన సంఖ్య చెప్పేవాడినని అన్నాడు.


వెస్ట్ వద్ద 17 మిలియన్ డాలర్ల (129 కోట్ల రూపాయలు) నగదు, 35 మిలియన్ డాలర్ల (267 కోట్ల రూపాయలు) స్టాక్, 81 మిలియన్ డాలర్ల (618 కోట్ల రూపాయలు) భవనాలు, 21 మిలియన్ డాలర్ల (160 కోట్ల రూపాయలు) భూములు ఉన్నాయని వెస్ట్ టీమ్ పేర్కొంది.

Updated Date - 2020-04-25T20:48:14+05:30 IST