సెల్ఫ్ ఐసొలేషన్‌కు మాజీ సీఎం రమణ్‌సింగ్

ABN , First Publish Date - 2020-08-13T00:27:06+05:30 IST

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. తన భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో..

సెల్ఫ్ ఐసొలేషన్‌కు మాజీ సీఎం రమణ్‌సింగ్

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. తన భార్యకు కరోనా పాజిటివ్ రావడంతో తాను, తన కుటుంబసభ్యలు సెల్ఫ్ ఐసొలేషన్‌లోకి వెళ్తున్నట్టు బుధవారంనాడు ఆయన ఒక ట్వీట్‌లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారు కూడా సెల్ఫ్ ఐసొలేషన్‌కు వెళ్లాలని కోరారు.


'నా భార్య వీణా సింగ్‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సలహా మేరకు ఆమె ఆసుపత్రిలో చేరారు. నేను, నా ఇతర కుటుంబ సభ్యులు ఐసొలేషన్‌లో పరీక్షలు చేయించుకుంటాం. ఇటీవల నన్ను కలిసిన వారు సైతం ఐసొలేషన్‌కు వెళ్లాలని, వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను' అని రమణ్ సింగ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో కొత్తగా 313 కేసులు నమోదు కావడం, ఐదుగురు మృత్యువాతపడిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో ఇంతవరకూ 12,938 కోవిడ్ కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 104కు చేరింది.

Updated Date - 2020-08-13T00:27:06+05:30 IST